Article Search

Significance  of Ratha Saptami 2024
రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు - రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి ఆరాధన, ఈ రోజు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. రథసప్తమినాడు ఏం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందో చూద్దాం... భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్..
అట్ల తదియ / అట్ల తద్దె శుభాకాంక్షలుపూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ..
అమలక ఏకాదశి సందర్భంగా
అమలక ఏకాదశి సందర్భంగాశ్రీ లక్ష్మీనారాయణాష్టకం.1)ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే ||2)అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||3)భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||4)సుహృదం సర్వ భూతానాం సర్వ లక్షణ సంయుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||5) చిదచిత్సర్వ జంతూనాం ఆధారం వరదం పరమ్ |అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||6) శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||7)పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్ర శోభితమ్ | అశేష దుఃఖ శాంత్యర..
శ్రీచక్రం యొక్క తొమ్మిది ఆవరణలు
 శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1. త్రైలోక్యమోహన చక్రం: ఇక్కడ, లోక అనే పదం మాత, మేయ మరియు మాన అనగా దర్శి, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్య లేదా ఇతర పదాలలో కర్తృ, కర్మ మరియు క్రియలను సూచిస్తుంది.  ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య.  ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని అంటే త్రైలోక్యాన్ని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు మూడింటిని ఏక ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగిస్తుంది, ఇది పూర్తి అద్వైతానికి దారితీస్తుంది. 2. సర్వాశాపరిపూరక చక్రం: ఇక్కడ, ఆశా అనే పదం మనస్సు యొక్క తృప్తి చెందని కోరికలను మరియు ఇంద్రియాలను మరింత ఎక్కువగా ద్వంద్వత్వం వైపు నడి..
గోమాత గొప్పదనం
ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది . ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.Shop Now For Latest Variety..

ధనుర్మాసవ్రతం ఎందుకు ఆచరించాలి ?

 

సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది ముప్పై రోజుల సంబరం, అలాగే మూలానక్షత్రం ప్రారంభ రోజున వుండడం కూడా ముఖ్య అంశం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.

కార్తీక పురాణము - ముప్పైవ రోజు పారాయణ

 

సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...

 

 

కార్తీక పురాణము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ

 

నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...

కార్తీక పురాణము - ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ

 

సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో, 

 

కార్తీక పురాణము - ఇరవై ఏడవ రోజు పారాయణ

 

విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథ తరువాత, ధర్మదత్తుడు మళ్ళీ వారిని 'ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠంలో విష్ణుద్వారపాలకులని విని వున్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో, ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు.

 

కార్తీక పురాణము - ఇరవై ఆరవరోజు పారాయణ

 

విష్ణు గణాలు చెప్పినది అంతా విని - విస్మృతచేష్టుడూ, విస్మయ రూపుడూ అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండప్రమాణాలు ఆచరించి, 'ఓ విష్ణు స్వరూపురాలా! ఈ జనానికి అంతా అనేకానేక క్రతు వ్రత దానాలచేత నా కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. 

కార్తీక పురాణము - ఇరవై ఐదవ రోజు పారాయణ

 

పృథువు అడుగుతున్నాడు: 'నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడినైనాను. అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఎలా ఆచరించబడిందో తెలియజేయి' అని కోరగానే, నారదుడు వినిపించసాగాడు.

 

కార్తీక పురాణము - ఇరవై నాలుగవ రోజు పారాయణ

 

ఇక ఇక్కడ యుద్ధరంగంలో అధికమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు, తిరిగి ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయాలని అనుకుని మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభ నిశాచరులచేత వధింపబడుతూ వున్న ఆ మాయాగౌరిని చూశాడు ఈశ్వరుడు. చూసీచూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు,

కార్తీక పురాణము - ఇరవైమూడవ రోజు పారాయణము 

 

వీరభద్రుడి మూర్ఛతో  వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరుగెత్తి పురహరున్ని శరణు వేడింది. అభవుడయిన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకూ భయకంపితులైన సమస్త గణాలవాళ్ళూ కూడా శివసందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధప్రవేశం చేశారు.
Showing 1 to 14 of 33 (3 Pages)